
- చేసింది మంచే కదా.. అయినా ఏడుపులా?
- – ప్రజలకు పనికివచ్చే నిర్మాణాలు చేస్తున్నా ఆగని విమర్శలు
- – కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నా పట్టని వైనం
- – విద్యార్థులనుంచి విమర్శలు రాకున్నా.. రెచ్చగొడుతున్న తీరు
విద్యార్థులను, సామాన్య ప్రజానీకాన్ని రెచ్చగొట్టే కాంపిటీషన్ అంటూ పెడితే.. వెలుగు పత్రికకే ఫస్ట్ ప్రైజ్ గ్యారెంటీ. అంతకు మించి జనాన్ని ఇక ఎవరూ రెచ్చగొట్టలేరన్నట్టుగా ఆ పత్రికలో కుట్ర పూరిత కథనాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కేసీఆర్ ను విమర్శించడమే ధ్యేయంగా.. జనం గుండెల్లో ఆయనకు ఉన్న చోటును ఖాళీ చేయించడమే లక్ష్యంగా.. వారి రాతలు, కుట్ర పూరిత కథనాలు నిత్యం రకరకాలుగా కొనసాగుతున్నాయి.
కరీంనగర్ లో.. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రకృతి వనం ఏర్పాటు చేయడాన్ని ఆ పత్రిక తప్పుబట్టింది. పచ్చని చెట్లతో ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపదను అందించే పనిపై పనికిమాలిన రాతలు రాసింది. జనానికి ఆరోగ్యాన్ని అందించే లక్ష్యాన్ని సైతం.. తక్కువ చేసి మాట్లాడింది. ఈ విషయంలో కాలేజీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకున్నా.. తానే రెచ్చగొట్టి పంపినట్టుగా.. కొందరితో మాట్లాడించి.. ఈ కుట్రల రాతలకు వెలుగు పదునుపెట్టింది.
మరో విషయం. కళాభారతి నిర్మాణం. అన్ని రకాల వర్గాల ప్రజలకూ ఇది ఉపయోగపడే విషయం. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే భవనం. అయినా కూడా.. విద్యార్థులను రెచ్చగొట్టేలా ఈ విషయాన్ని సైతం వెలుగు.. విషమయం చేసింది. ఇప్పటివరకూ విద్యార్థులకు నష్టం అంటూ చేయని రాష్ట్ర ప్రభుత్వం గురించి ఊహాజనిత కథనాలు, ఆరోపణలు చేసి.. తన కుటిలబుద్ధిని, అసలు రంగును బయటపెట్టుకుంది వెలుగు పత్రిక.
నిజంగానే.. విద్యార్థులకు సమస్యలు ఉంటే.. వారికి భవనం సరిపోకుంటె.. ప్రభుత్వం కచ్చితంగా పూర్తి హంగులతో మరో నూతన భవనాన్ని సమకూర్చడం ఖాయం. అలాంటి అవసరమే లేనప్పుడు.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు.. ఒకరిద్దరు వ్యక్తం చేసే అభ్యంతరాలను.. అభిప్రాయాలను వెలుగు ఎందుకు ఇంతగా ప్రచారం చేస్తోందన్నదే పాయింట్. అదే జనం ఆలోచించాలి. ఆ పత్రికకు ఆ జనాలే తగిన బుద్ధి చెప్పాలి. వస్తుంది.. ఆ సమయమూ వస్తుంది.