You are here
Home > Uncategorized > వర్షాలు ఉన్నయ్ కాబట్టి సరే.. మరి లేనప్పుడు ఇలాగే వార్తలు రాస్తారా?

వర్షాలు ఉన్నయ్ కాబట్టి సరే.. మరి లేనప్పుడు ఇలాగే వార్తలు రాస్తారా?

Spread the love

 

వర్షాలు ఉన్నయ్ కాబట్టి సరే.. మరి లేనప్పుడు ఇలాగే వార్తలు రాస్తారా?

– కాళేశ్వరం నీళ్లపై పనికిమాలిన రాతలతో బయటపడిన కుట్రలు

– వర్షాలు లేనప్పుడు ఆదుకున్నది కాళేశ్వరమే అన్నది మరిచారా?

– ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకింది నిజం కాదా?

వెలుగు పత్రికకు సిగ్గూ ఎగ్గు ఉండాలె. ప్రపంచమే గర్వపడి.. డిస్కవరీ లాంటి మీడియా సంస్థ కూడా లిఫ్టింగ్ ఎ రివర్ పేరుతో అత్యద్భుతమైన కథనాలు ప్రసారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడ్డగోలు కూతలకో.. పనికిరాని లెక్కలతో వార్తలు రాసినందుకు. వరుసగా.. మూడో ఏడాది కూడా వరద వచ్చి.. నీటిని నదిలోకి వదిలిన కారణంగా.. 36 టీఎంసీల నీళ్లు వృథా అయ్యాయని ఆ పత్రిక గగ్గోలు పెడుతోంది. కానీ.. వాస్తవం ఏమిటి?

ఒకప్పుడు వర్షాకాలంలో కూడా తెలంగాణ చెరువులు ఎండిపోయి ఉండేవి. కానీ.. కాళేశ్వరం వచ్చిన తర్వాతే.. కోటి ఎకరాల సాగు కల సాకారమైంది. ఇది నిజం కాదా? అంతే కాదు.. వేసవిలో కూడా తెలంగాణ చెర్వులు మత్తడి దుంకింది నిజం కాదా? ఇప్పుడంటే వర్షాలు బాగా పడ్తున్నయ్. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతున్న శుభవేళ.. ప్రాజెక్టులు కళకళగా మారుతున్నయ్. అందుకే.. వరద ఎక్కువున్నప్పుడు నీళ్లను కిందికి వదులుతున్నరు.

ఇప్పుడు ఏ మాత్రం వర్షాలు లేకుండా ఉంటే.. ఇలా వార్తలు రాసేవాళ్లా? ఇంత శ్రమ పడుతున్న ప్రభుత్వం.. రైతుల కోసం ఈ ఖర్చును పెట్టుబడిగానే చూస్తోంది. కానీ.. అదే వర్షాలు లేకుంటె.. ఈ నీళ్లన్నీ తెలంగాణ పొలాలను పచ్చగా చేస్తే.. అప్పుడు మన రైతుల ఇంట సిరులు కురిసినందుకు.. కాళేశ్వరం కారణం అయి ఉండక పోయేదా? కనీసం ఈ విషయాన్ని మాట మాత్రమైనా ఆలోచించారా.. ఇలాంటి కుటిల కథనాలు రాసేముందు?

వివేక్ బీజేపీలో చేరినంత మాత్రాన.. కాళేశ్వరం గురించి తప్పుగా రాస్తారా? మీ రాజకీయ లాభాల కోసం మంచి ప్రాజెక్టు విషయంలో తప్పుడు కూతలు కూస్తారా? మీలాంటి వాళ్లకు జనాలే బుద్ధి చెప్తరు. కాళేశ్వరం నీళ్లతో సిరుల పంట సాగు చేస్తున్న రైతులే మీ పత్రికకు, మీ అధినేతలకు బుద్ధి చెప్తరు. బీజేపీ నేతలారా.. వెలుగు పత్రిక రాతగాళ్లారా.. జాగ్రత్త. రాసేముందు.. కాస్త ఆలోచించుకోండి. భవిష్యత్తును అర్థం చేసుకుని.. కుట్రలు ఆపండి. ఆ తర్వాతే వార్తలు రాయండి.

Top