You are here
Home > Uncategorized > ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ..

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ..

Spread the love

 

  • ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ..
  • అందుకే బీజేపోళ్లు ఎక్కువ మాట్లాడుతున్నారు
  • సెక్రటేరియట్​లో మరో గుడికి రంగం సిద్ధం

 

సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారు. అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడినట్టే! ఈ మాటలన్నది ఎవరో ఒక చోటామోటా నాయకుడు కాదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని అంటూ మురిసిపోయే మురళీధర్ రావు!! బీజేపీలో ఇలాంటి నాయకులు మోపయ్యారు కాబట్టే తెలంగాణలో దాని పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఇలాంటి మేధావులను జాతీయస్థాయి నాయకులను చేశారు కాబట్టే దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. సెక్రటేరియట్​లో ఏం జరిగిందో తెలిసి కూడా మురళీధర్​ రావు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నడు.

అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. జనాన్ని తప్పుదోవపట్టిస్తున్నాడు. తెలంగాణలో కులమతవర్గ విబేధాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావడానికే బీజేపీ నాయకులు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి సెక్రెటేరియట్​లో గుడిని, మసీదును కూల్చేయలేదు. పాత భవనాలను కూల్చే క్రమంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం వాటిల్లింది. పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నాయి. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది.

ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్​ కూడా కోరారు.  ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఖర్చుకు వెనుకాడకుండా దేవాలయం, మసీదులను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగించనుంది.  ఈ విషయమై దేవాలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే కేసీఆర్​ సమావేశం కూడా అవుతారు. ఇంతకంటే మురళీధర్​ రావుకు ఏం కావాలి ? పాత వాటిస్థానంలో కొత్తవి వద్దంటే ఎవరు ఏం చేయగలరు ? మాకు రాజకీయాలే కావాలి.. డెవెలప్​మెంట్​ వద్దని మొండికేస్తే వీరికే నష్టం.

Top