You are here
Home > Uncategorized > పశుపక్ష్యాదులకూ మంచి రోజులు..!

పశుపక్ష్యాదులకూ మంచి రోజులు..!

Spread the love

 

పశుపక్ష్యాదులకూ మంచి రోజులు..!

– ప్రజలు ఏనాడూ ఊహించని అద్భుతమైన అభివృద్ధి ఫలాలు

– మనుషులనే కాక.. పశువుల సంక్షేమానికీ ప్రభుత్వ చర్యలు

– త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4 వెటర్నరీ కళాశాలల ఏర్పాటు

సరిగ్గా ఆరేడేళ్ల క్రితం సందర్భాన్ని మనం గుర్తుచేసుకుంటే.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. అని అంతా ఆశ్చర్యపోతాం. అంతటి మార్పును.. అంతటి అభివృద్ధిని కేసీఆర్ సర్కారు మన ముంగిట్లోకి తీసుకువచ్చింది. ప్రజలకే కాదు.. పశు పక్ష్యాదులకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తూ.. వాటిపై ఆధారపడిన వారిని ఆర్థికంగా ఉన్నతులు చేసే కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. దేశానికి వెటర్నరీ విభాగంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది.

గొర్రెల పంపిణీ వంటి చర్యలు.. చేపల పెంపకం వంటి నిర్ణయాలు.. పాడి రంగానికి ప్రోత్సాహకాలతోనే కేసీఆర్ ప్రభుత్వం ఆగిపోలేదు. రాష్ట్రంలో పశు సంపదను అత్యంత భారీగా వృద్ధి చెందించడంతోనే.. అభివృద్ధి కార్యక్రమాలను ఆపలేదు. ఆ పశు సంపద ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన చర్యలను సైతం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. రాష్ట్ర వ్యాప్తంగా 4 వెటర్నరీ కళాశాలలను అత్యంత త్వరలో ఏర్పాటు చేయబోతోంది.

వరంగల్, సిద్ధిపేట, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో.. ఈ వెటర్నరీ కాలేజీలు అందుబాటులోకి రానున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా.. సిద్ధిపేట జిల్లా పర్యటనలో వెల్లడించారు. వీటితో.. రాష్ట్రంలో పశువుల ఆరోగ్య ప్రమాణాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కలుగుతాయి. ఫలితంగా.. పాడి వృద్ధికి, ఇతర పశువుల అభివృద్ధికి.. వాటి జీవన స్థాయిల పెరుగుదలకు తగిన వసతులు అందుబాటులోకి వస్తాయి.

ఇంతటి ముందు చూపును, సమర్థ కార్యాచరణను ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. తెలంగాణలో పశు సంపదకు.. ఇంతటి ఉత్పత్తి శక్తి ఉందని నాడు ఏ ప్రభుత్వమూ ఆలోచన సైతం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే.. ఈ తీరు మారింది. పశు సంవర్థక శాఖ పని తీరు మారింది. ఆ రంగంపై ఆధారపడిన ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి. వారి ఆర్థిక స్థితి ఉన్నతమైంది. దేశానికే మన రాష్ట్రం.. ఈ రంగంలో రోల్ మోడల్ గా ఎదిగింది.

Top