You are here
Home > Latest News > వీహెచ్.. 40 ఏళ్ల మీ పాలనలో ఎన్ని అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించారు

వీహెచ్.. 40 ఏళ్ల మీ పాలనలో ఎన్ని అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించారు

Spread the love
  • వీహెచ్.. 40 ఏళ్ల మీ పాలనలో ఎన్ని అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించారు
  • కావాలని తెలంగాణలో అల్లర్లు సృష్టించాలనుకుంటున్నావా?
  • అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట పేరుతో తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నావు
  • ఇదేనా నీ రాజకీయ అనుభవం
తెలంగాణలో ఎలాగైనా అల్లర్లు సృష్టించాలి. తెలంగాణ గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉంది. ఒక్క మత కల్లోలం జరగలేదు. ఒక్క లొల్లి జరగలేదు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో ఎలాగైనా తెలంగాణలో మళ్లీ అల్లర్లు స్టార్ట్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎలా కలహాలు చోటు చేసుకున్నాయో.. మళ్లీ ఇప్పుడు కూడా అలాగే చేయాలన్న దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలకు తెర లేపుతున్నారు కాంగ్రెస్ నాయకులు.
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వీహెచ్ కూడా ఇలాంటి పనులు చేయడం నిజంగా సిగ్గు చేటు. తన ఇష్టారీతిన పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏంది. ఇది కావాలని కొన్ని వర్గాలను రెచ్చగొట్టే పనికాదా? కావాలని తెలంగాణలో అల్లర్లు సృష్టించే పని కాదా? కాంగ్రెస్ హయాంలో ఎన్ని అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పుడు మీకు ఎందుకు చేతగాలేదు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌ను గౌరవించడం చేతగాలేదు కానీ.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారాలు చేయడం కోసమే ఇటువంటి కుట్రలకు తెర తీస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులకు కొంచెమైనా సిగ్గూశరం ఉంటే.. ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. తెలంగాణ కోసం వాళ్లు ఏనాడూ చేసిందేమీ లేదు. కేవలం తెలంగాణను దోచుకుతిన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ నాశనాన్నే కోరుకుంటున్నారు. అందుకే ఇటువంటి చీప్‌ట్రిక్స్. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా వీహెచ్ ఇలాంటి పనులు చేయడం నిజంగా సిగ్గుచేటు. అది ఆయనకే అవమానం. ఆయనకు కొంచెమైనా సిగ్గూశరం ఉంటే ఇటువంటి పనులు చేయడు. కానీ.. వయసు పెరిగినా బుద్ధి పెరగలేదన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఆయనకు మళ్లీ ఇతర కాంగ్రెస్ నేతలు వత్తాసు పలకడం. తర్వాత ఆయనకు షుగర్ లేవల్స్ పెరిగిపోయాయంటూ మరో అబద్ధపు ప్రచారం.. ఇలా.. వాళ్లు చేసే ఆగడాలు శృతి మించిపోతున్నాయి. తెలంగాణలో కావాలని అల్లర్లు సృష్టించాలనుకుంటున్న కాంగ్రెస్ నేతల భరతం పట్టాలి. వాళ్లను తెలంగాణ నుంచే తరిమేయాలి. అప్పుడే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది.

Top