You are here
Home > Latest News > వివేక్​.. మైండ్​ దొబ్బిందా నీకు ?

వివేక్​.. మైండ్​ దొబ్బిందా నీకు ?

Spread the love
  1. వివేక్​.. మైండ్​ దొబ్బిందా నీకు ?
  2. క్యాండిడేట్ల‌ను టీఆర్ఎస్ కొన‌డ‌మేంటి !!
  3. మ‌తి ఉండే మాట్లాడుతున్న‌వా ?

 

అవినీతి డ‌బ్బుతో టీఆర్ఎస్ నాయ‌కులు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీకి క్యాండిడేట్ల‌ను కొన్నార‌ట‌!! ఇదేమైనా న‌మ్మేలా ఉందా ? ఏదో గ‌ల్లీ లీడ‌ర్ ఇలాంటి మాట‌లు అన్న‌డంటే అర్థం చేసుకోవ‌చ్చు. బీజేపీలో పెద్ద నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతున్న గ‌డ్డం వివేక్ అన్సాల్సిన మాట‌లేనా ఇవి ? ఎక్కువ మంది ఆశావ‌హులు ఉండ‌టం వ‌ల్ల టీఆర్ఎస్‌కు చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చిన సంగ‌తి అంద‌రికీ తెలుసు. ప్ర‌తి ఒక్కరికీ టికెట్ ఇవ్వ‌లేక పార్టీ హైక‌మాండ్ చాలా క‌ష్టాలు ప‌డింది.

టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని తెలుసు కాబ‌ట్టి అన్ని పార్టీల వాళ్లూ తెరాస నుంచి పోటీకి క్యూ క‌ట్టారు. వివేక్ ఇట్ల మాట్లాడ‌ట‌మేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.  ఈసారి కూడా తెరాస అన్ని స్థానాల్లో గెలుస్తుంద‌ని అన్నీ స‌ర్వేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి.  కొంద‌రైతే టికెట్ల కోసం ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నాలు కూడా చేసుకున్న‌రు. రాష్ట్రంలో ఇలాంటి స‌మ‌స్య తెరాస మిన‌హా ఏ పార్టీకి లేదు. ఇత‌ర పార్టీలు క్యాండిడేట్లు లేక ఈగ‌లు తోలుకుంటే.. ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో తెలియ‌క తెరాస నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఇటువంటి ప‌రిస్థితుల్లో తెరాస క్యాండిడేట్ల‌ను కొంటుందా వివేక్ ? ఓట్ల‌ను కొనాల్సిన అవ‌స‌రం దానికి ఏముంది ? మ‌ంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల‌ను, కార్పొరేష‌న్ల‌ను బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేశారు. బోలెడు నిధులు గుమ్మ‌రించారు. ప్ర‌తి చోటా పార్కులు, అమ్యూజ్‌మెంట్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఆయ‌న చేసిన ప‌నులే ఓట్లు కురిపిస్తాయి. తెరాస ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే దానికి శ్రీరామ‌ర‌క్ష‌. బీజేపీ, కాంగ్రెస్‌లా నీచ రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం తెరాస‌కు లేనేలేదు. తెలంగాణ బీజేపీ చిన్న మొక్క వంటిది. దానిని ఎద‌గ‌కుండా చేస్తున్న‌ది ఎవ‌రో కాదు.. వివేక్ వంటి నాయ‌కులే. వీళ్ల తెలివి త‌క్కువ త‌న‌మే పార్టీ ఎదుగుద‌ల‌కు అతిపెద్ద అవ‌రోధం.

Top