You are here
Home > Uncategorized > ఓ మోసకారి గురించి.. మరో మోసకారి చిలుక పలుకులు!

ఓ మోసకారి గురించి.. మరో మోసకారి చిలుక పలుకులు!

Spread the love

 

ఓ మోసకారి గురించి.. మరో మోసకారి చిలుక పలుకులు!

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదంటున్న వివేక్

– నాగార్జున సాగర్ ఇచ్చిన అనుభవం మరిచి బీజేపీ గూటి నుంచి విమర్శలు

– ఈటల, వివేక్.. ఇద్దరూ మోసగాళ్లే అని ఆగ్రహిస్తున్న హుజూరాబాద్ ప్రజలు

హవ్వ.. నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు… అన్నట్టే విశాఖ ఇండస్ట్రీస్ అధినేత, వెలుగు పత్రిక ఓనర్, వి6 న్యూస్ ఛానల్ యజమాని, బడా వ్యాపారవేత్త, కోట్లు కూడేసుకున్న ఇండస్ట్రియలిస్టు.. ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా అయిన వివేక్ వ్యవహారం నడుస్తోందిప్పుడు. ఒకపప్పుడు కాంగ్రెస్ లో కానినోడు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో.. మంచి అవకాశం ఇచ్చి ఎంపీని చేసి. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన వివేక్ ఇలా కాకుంటే ఇంకా ఎలా మాట్లాడతాడు?

పైగా.. తనలాగే నాయకుడై, తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగి, మంత్రిగా జీవితాన్ని చూసిన ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అయితే.. వివేక్ ఇంకెంత దిగజారుడుగా ఉంటాడు? ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వివేక్ మాట్లాడుతున్న తీరుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధపడాలి. అసలు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థే దొరకడం లేదంటున్న వివేక్ కు.. గట్టిగా శాస్తి చెప్పేందుకు అడుగులు వేయాలి.

లీడర్లను కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీగా ఖర్చు పెట్టిందని, బీజేపీ నాయకులంతా కలిసి ఈటలను గెలిపించుకుంటామని వివేక్ అంటున్నడు. అసలీ డబ్బుల లెక్కలేందిర బై.. మీ నాన్న విగ్రహం ట్యాంక్ బండ్ పై  పెట్టించుకునేందుకు నువ్వు ఎంత ఇచ్చినవ్ చెప్పు కేసీఆర్ ప్రభుత్వానికి.. అని ప్రజలు నిలదీస్తున్నరు. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖర్చు పెట్టే ఉద్దేశమే ఉంటే.. ఇంత సీన్ అవసరం లేదని చెబుతున్నరు.

డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నాయకుడివి కాబట్టి.. వివేక్ అలాగే మాట్లాడతాడని.. అతనికి తగిన బుద్ధి చెప్పినట్టే ఈటల రాజేందర్ కూ శాస్తి చేస్తమని ఇప్పటికే హుజూరాబాద్ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సారి అబద్ధాలకు జడిసేది లేదని.. మనసు మార్చుకునేది లేదని.. కేసీఆర్ సారు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా.. కష్టపడి గెలిపించి.. తర్వాత కొట్లాడి మరింత అభివృద్ధి సాధిస్తమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

ఈ వేవ్ చూస్తుంటే.. వివేక్ అండ్ బీజేపీ నేతలకు భంగపాటు తప్పదని.. ఈటల రాజకీయ జీవితానికి సమాధి ఖాయమని.. తెలంగాణ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Top