You are here
Home > Uncategorized > వివేక్.. నువ్వు చెప్పిన వాళ్లకు టెండర్లు ఇవ్వాలా?

వివేక్.. నువ్వు చెప్పిన వాళ్లకు టెండర్లు ఇవ్వాలా?

Spread the love

వివేక్.. నువ్వు చెప్పిన వాళ్లకు టెండర్లు ఇవ్వాలా?

– కృష్ణా జలాలపై వితండ వాదం చేస్తున్న విపక్షాలు

– అటు తిరిగి ఇటు తిరిగి కాంట్రాక్టర్ పై వివాదానికి యత్నం

– కేసీఆర్ ను ఏమీ చేయలేక.. అటునుంచి నరికే కుటిలనీతి

ఇటు నుంచి కాకుంటే.. అటు నుంచి అందంట వెనకటికో వ్యభిచారి. ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర విపక్షాల తీరు అచ్చం అలాగే ఉంది. ఇన్నాళ్లూ ఈ వివాదంపై.. రచ్చ చేసి చేసి.. జనం దృష్టిని ఏ మాత్రం ఆకర్షించలేక.. కేసీఆర్ పై తప్పుడు ప్రచారాలు నిజమని జనాన్ని నమ్మించలేక ఊగిపోయిన బీజేపీ, కాంగ్రెస్, ఇతర తోక పార్టీల నేతలు.. ఇప్పుడు వివాదాన్ని కాంట్రాక్టరుపై నెట్టేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. చేతకాని తనాన్ని నిరూపించుకుంటున్నారు.

మేఘా సంస్థకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలని వివేక్ వెంకటస్వామి అంటడు. కృష్ణాలో 299 టీఎంసీలకే కేసీఆర్ అంగీకరించారని జితేందర్ రెడ్డి అంటడు. తెలంగాణ బందీ అయిందని కోదండరాం అంటడు. ఇట్ల రకరకాల మాట్లాడేవాళ్లు వాస్తవాలను గుర్తిస్తలేరని.. అసలు ఈ ప్రతిపక్షాలు తెలంగాణ మంచినే కోరుతున్నయా అని జనం అంటున్నరు. తెగించి బరిలోకి దిగి కొట్లాడుతున్న కేసీఆర్ ను కాదని.. ఈ బఫూన్ గాళ్లను ఎలా నమ్మేదని ప్రశ్నిస్తున్నరు.

పారదర్శకంగా టెండర్లు జరిగాయి కాబట్టి.. వాటిని రద్దు చేసే అవకాశమే లేదు. అర్హులకే టెండర్లు దక్కాయి కాబట్టి.. అనర్హులకు కట్టబెట్టే ప్రసక్తే లేదు. అంతే కానీ.. వివేక్ అన్నడనో.. ఇంకెవరో తిట్టారనో కేసీఆర్ సర్కారు.. వాళ్లు చెప్పిన వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి.. వివేక్ మూస్కుని ఉండాలె. 299 టీఎంసీలకే కేసీఆర్ అంగీకరిచారని అంటున్న జితేందర్ రెడ్డి.. తన ఆరోపణలను రుజువు చేయకుంటే.. ముక్కు నేలకు రాసి జనానికి క్షమాపణ చెప్పాలె.

తలాతోకా లేని మాటలు మాట్లాడుతున్న కోదండరాం.. అసంబద్ధ విమర్శలు చేస్తూ అడ్రస్ లేని పార్టీలో కొనసాగుతున్న మల్లు రవి, గవినోళ్ల శ్రీనివాస్, సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్ లాంటి వాళ్లు.. మాటలు కాకుండా ఆధారాలతో జనాల్లోకి రావాలె. లేదంటే.. ఒక్కొక్కళ్లను ప్రజలు రాజకీయంగా తవ్వి బొంద పెట్టుడు ఖాయం. ఎవరెన్ని విమర్శించినా.. ఒక్కటి మాత్రం నిజం. కేసీఆర్ ఉన్నంత వరకూ.. తెలంగాణ ఒక్క చుక్క నీటి బొట్టు కూడా నష్టపోదు. ఇది సత్యం. ఇది తథ్యం.

Top