You are here
Home > Uncategorized > వీఆర్వో వ్యవస్థ అంతం… తెలంగాణకు చరిత్రాత్మకమైన సమయం.

వీఆర్వో వ్యవస్థ అంతం… తెలంగాణకు చరిత్రాత్మకమైన సమయం.

Spread the love

 

వీఆర్వో వ్యవస్థ అంతం… తెలంగాణకు చరిత్రాత్మకమైన సమయం

–         అవినీతికి కేరాఫ్ గా ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దు

–         శాసనసభ ముందుకు నూతన చట్టానికి సంబంధించిన బిల్లు

–         ప్రతి కుటుంబానికి మేలు చేసేలా బిల్లుకు రూపకల్పన

ముఖ్యమంత్రి కేసీఆర్.. అనుకున్నది సాధించారు. రెవెన్యూ శాఖలో అవినీతిని అంతం చేస్తామని చెప్పిన ఆయన.. ఆ దిశగా అడుగులు వేశారు. కొత్త రెవెన్యూ బిల్లును శాసన సభ ముందుకు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల పదవుల రద్దు 2020 పేరుతో బిల్లును సభ ముందు పెట్టారు. ఇది ఆమోదంలోకి వస్తే.. వీఆర్వో పదవులు రద్దవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వర్తించేలా రూపకల్పన చేశామన్నారు.

అవినీతి అంతమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ఈ బల్లులో కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. యావత్ దేశాన్ని ఈ ప్రతిపాదనలు ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ ధైర్యాన్ని అవి ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. అవినీతి లేని పాలన కోసం.. కేసీఆర్ ఎంత దూరమైనా వెళ్తారన్న వాస్తవాన్ని.. అందరూ గ్రహించేలా చేస్తున్నాయి.

ఈ బిల్లు ఆమోదంపై ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి కోసం మాత్రమే ఈ చట్టం వర్తిస్తుండడంపై.. ఇకముందు సాగు భూముల వ్యవహారాల్లో అక్రమాలకు తావు ఉండదని రైతులు ఆనందపరవశులవుతున్నారు. తమ భూములపై తమకే సంపూర్ణ హక్కులు.. రాజ్యాంగబద్ధంగా అమల్లోకి రానున్నాయని సంతోషిస్తున్నారు.

ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయించడం ద్వారా.. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో.. రైతులు, యజమానులు.. తమ భూముల వివరాలు ఆన్ లైన్ లో చూసుకునే అవకాశం కూడా ఈ బిల్లు చట్టంగా మారితే రానుంది. రిజిస్ట్రేషన్లు సైతం.. ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్ల ద్వారా మాత్రమే చేయాల్సి వస్తుంది కాబట్టి… పారదర్శకతకు పెద్ద పీట వేసినట్టు అవుతుంది.

ఇలా.. ఏ రకంగా చూసినా.. వ్యవసాయ భూమికి భద్రత పెరుగుతుంది. గతంలో జరిగినట్టుగా అన్యాక్రాంతం కాకుండా భూమి భద్రంగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన మోసాలకు చరమగీతం పాడినట్టు అవుతుంది. అందుకే.. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని అవినీతి రహిత ప్రభుత్వంగా గుర్తిస్తున్నారు. కేసీఆర్ వంటి నాయకుడు.. రాష్ట్రానికే కాదు.. యావత్ దేశానికీ తన నాయకత్వంతో మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

Top