You are here
Home > Uncategorized > పగటి కలలు కంటున్న ” ఉత్త ” కుమారుడు….

పగటి కలలు కంటున్న ” ఉత్త ” కుమారుడు….

Spread the love
  • 80 సీట్లు గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తరట.
  • మొహం ఏనాడైనా అద్దంలో చూసుకున్నవా ఉత్తమ్.
  • డబుల్ డిజిట్ అయినా సాధిస్తారా అన్నది డౌట్??.

ఒకపక్క దేశం మొత్తం కాంగ్రెస్ ఓటమి పాలు అవుతూ వస్తుంటే… రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో 80 సీట్లతో అధికారంలోకి వస్తారంట?. పీసీసీ ఆశలకు హద్దులేకుండా పోయింది. అధికారంలో ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రంలోనే 80 సీట్లు తెచ్చుకోలేకపోయారు. 122 సీట్ల నుంచి కేవలం 78సీట్లు పరిమితం అయ్యారు. అధికారం ఉన్నచోట చేజార్చుకుంటూ.. లేనిచోట అధికారంలోకి వస్తరంట?.

తెలంగాణలో 13 సీట్ల నుంచి 80 సీట్లకు పెరుగుతామనడం హాస్యాస్పదం కాదా ఉత్తమ్. 80 సీట్లతో అధికారంలోకి వస్తామంటున్న ఉత్తమ్.. నీ మొహం ఎప్పుడైనా అద్దంల చూసుకున్నవా?. ఏం చూసి నీకు, నీ పార్టీకి ఓట్లేయాల్నో చెప్పు. 60 ఏండ్లు పాలించిన మీరు తెలంగాణను ఏం అభివృద్ధి చేశారో చెప్పు?.దశాబ్ధాలుగా అభివృద్ధి చేయకపోవడంతో పాటు… రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో కుట్రలు చేశారు. టీఆర్ఎస్ ను బ్లేమ్ చేసేందుకు ఎన్నో పన్నాగాలు పన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ప్రతీ నోటిఫికేషన్ పై కేసులు వేశారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు అడ్డుకుని వేలమంది కార్మికుల పొట్టగొట్టారు. ఇక.. తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులపై 200కు పైగా కేసులు వేశారు. హైకోర్ట్, సుప్రీం కోర్ట్,…గ్రీన్ ట్రైబ్యునల్ లాంటి కోర్టుల్లో కుట్రలతో కేసులేసి ప్రాజెక్టుల్ని అడ్డుకున్నారు. అయినా… మీ కుట్రలన్నీ చేధించి తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తోంది టీఆర్ఎస్ సర్కార్.

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతోంది. అందుకే అందివచ్చిన ప్రతీసారి.. టీఆర్ఎస్ కే ఓటేస్తూ.. మరో పదేళ్లు మీరే పాలించాలని టీఆర్ఎస్ ను ప్రజలు దీవిస్తున్నారు. అదే సమయంలో సిట్టింగ్ స్థానాల్లోనూ కాంగ్రెస్ ను బొందపెడుతున్నారు. ఇదే రేపు 2019 ఎన్నికల్లో రిపీట్ కాబోతోంది. టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ తెలంగాణలో తుడిచి పెట్టుకుపోబోతోంది.

 

Top