You are here
Home > Latest News > ఏ రాష్ట్రం వారైనా.. కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న తెలంగాణ

ఏ రాష్ట్రం వారైనా.. కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న తెలంగాణ

Spread the love

ఏ రాష్ట్రం వారైనా.. కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న తెలంగాణ

  • అది రాష్ట్ర బాధ్యతగా చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ
  • ఇతర రాష్ట్రాల ప్రజలు ఆందోళన పడవద్దని భరోసా
  • ఎన్నాళ్లు ఇక్కడ ఉన్నా.. అన్ని రోజులూ కాపాడుకుంటామని హామీ

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లను కొన్ని రాష్ట్రాలు ఎలా వెళ్లగొడుతున్నాయో చూస్తున్నాం. కనీసం.. తిండికి, నీళ్లకు కూడా నోచుకోకుండా ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాయో చూస్తున్నాం. కరోనా సృష్టిస్తున్న విలయంలో చిక్కుకుని.. దిక్కు లేని అభాగ్యులు రాష్ట్రాల సరిహద్దుల్లో పడుతున్న బాధలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇంతటి కష్టంలోనూ.. ఇంతటి సంక్లిష్టమైన సమయంలోనూ.. తెలంగాణ అంటే ఏంటో తన చర్యలతో చాటి చెప్పారు.. మన ముఖ్యమంత్రి కేసీఆర్. మన ప్రజల మానవత్వాన్ని.. మన ప్రభుత్వ గొప్పతనాన్ని దేశానికి చాని శభాష్ అనిపించుకున్నారు.

తెలంగాణలో పని చేస్తున్న వారు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే.. కడుపులో పెట్టుకుని చూసుకుంటమని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వాళ్లు.. ఎన్నాళ్లు ఇక్కడ ఉంటామన్నా సరే.. ఎన్నాళ్లు ఇక్కడ బతుకుతామన్నా సరే.. వెళ్లగొట్టేది లేదని తేల్చి చెప్పారు. కార్మికుల రూపంలో.. రాష్ట్రానికి వాళ్లు ఎంతో సేవ చేస్తున్నారని.. అందర్నీ కాపాడుకుంటామని.. తిండికి, నీటికి, వసతికి లోటు రాకుండా చూసుకుంటామని వెల్లడించారు. వారందరినీ తెలంగాణ కుటుంబ సభ్యులుగానే చూసుకుంటామని.. తమ్ముడిగా, చెల్లిగా, కొడుకుగా, కూతురిగా.. భావిస్తామని చెప్పారు.

ఏ రాష్ట్రానికి చెందినవారైనా సరే.. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా సరే.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారందరికీ.. మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున రేషన్ ఇస్తామని.. చపాతి తినే అలవాటు ఉన్నవారికి గోధుమపిండిని అందిస్తామని తెలిపారు. తగిన రీతిలో ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని వెల్లడించారు. ఎలాంటి చింత పడకుండా.. ఆందోళన చెందకుండా.. హాయిగా జీవించాలని కోరారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ల జాబితాను తయారు చేస్తున్నామని.. అందరినీ ఆదుకుంటామని తెలిపారు.

ఆపదలో ఉన్న వారు.. కలెక్టరును కానీ.. పోలీసులను కానీ.. సర్పంచును కానీ.. కలిసి సమస్యలు చెప్పుకొంటే.. స్థానికంగా ఉన్న పెద్దలు ఆదుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో చెబుతున్నా.. మీకు సమస్య రానివ్వను అంటూ పెద్దమనసు చాటుకున్నారు. సొంత రాష్ట్రాల ప్రభుత్వాలే పట్టించుకోని ప్రస్తుత తరుణంలో.. ఇలా పెద్దన్నగా.. పెద్ద కొడుకుగా నిలుస్తూ.. అందరినీ ఆదుకుంటున్న కేసీఆర్ మానవత్వానికి దేశం యావ్తతూ జేజేలు పలుకుతోంది. ఆయన మానవత్వానికి సలాం కొడుతోంది. ఇతర రాష్ట్రాల పాలకులు.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని దేశం కోరుకుంటోంది.

Top