You are here
Home > Latest News > వైఎస్ బతికి ఉన్నప్పుడు తెలంగాణ మీదా ఎస్మా కంటే ఎక్కువ ప్రయోగాలే చేశిండు,దాసోజు ఇంకా ఎవరు మరచిపోలేదు

వైఎస్ బతికి ఉన్నప్పుడు తెలంగాణ మీదా ఎస్మా కంటే ఎక్కువ ప్రయోగాలే చేశిండు,దాసోజు ఇంకా ఎవరు మరచిపోలేదు

Spread the love

– తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన తీరు

– హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా కావాలన్నది మరిచిపోగలమా?

– తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనన్నారే.. అది మరిచిపోగలమా?

– గతం మరిచి నీఛపు మాట్లాడుతున్న దాసోజు శ్రవణ్

ఒకప్పుడు టీఆర్ఎస్ లో ఏదో వెలగబెడతాడని అనుకున్న దాసోజు శ్రవణ్.. చివరికి తన దగ్గర ఎలాంటి విషయం లేదని బయటపడడంతో.. కాంగ్రెస్ వాళ్లు వేసిన ముష్టిని పట్టుకుని ఇప్పుడు రోజూ నాలుగు మాటలు మొరుగుతున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తే.. ఈజీగా మీడియాలో చోటు దొరుకుతుందని ఆశపడుతున్నవారిలో ఒకడిగా తయారవుతున్నాడు. ఆర్టీసీ సమ్మె హెచ్చరికలపై ప్రభుత్వ స్పందనను తప్పుబడుతూ కార్మికుల ఆగ్రహానికి గురవుతున్నాడు. సిగ్గూ ఎగ్గూ లేని తీరుకు అచ్చమైన ఉదాహరణగా మారిపోతున్నాడు.

తెలంగాణ ఉద్యమం సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎస్మా అని ఉంటే.. రాష్ట్రం వచ్చి ఉండేదా అని దాసోజు శ్రవణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇదే నోటితో గతంలో అదే కాంగ్రెస్ ను తిట్టి పోసిన చరిత్రను మరిచి.. చరిత్రహీనుడని తనకు తానే దాసోజు నిరూపించుకున్నాడు. నాడు వైఎస్.. హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా కావాల్సి వస్తుందేమో అని సీమాంధ్రులను రెచ్చగొట్టాడు. తర్వాత రోశయ్య.. ముఖ్యమంత్రిగా ఉండి కూడా సీమాంధ్ర ఆందోళనలకు మద్దతు తెలిపి రోడ్డుపై కూర్చుని.. ఆత్మాభిమానాన్ని తనకు తానే చంపేసుకున్నాడు.

ఆఖరికి కిరికిరి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా మరిచిపోగల? చట్టసభల సాక్షిగా.. తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పిన ఆయన..కాంగ్రెస్ కు చెందినవాడు కాదా? అంతకు ముందు వైఎస్ కావొచ్చు.. రోశయ్య కావొచ్చు. వీళ్లంతా కాంగ్రెస్ విష వృక్షాలు కాదా? వీళ్లు చేయబట్టి వందల మంది తెలంగాణ యువతీయువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది నిజం కాదా? ఇలాంటివాటిని తరిమికొట్టేందుకే కేసీఆర్ నాడు ఉద్యమ నాయకుడయ్యారు. కాంగ్రెస్ దోపిడీకి చరమగీతం పాడుతూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయవంతం అవుతున్నారు.

ఇది తట్టుకోలేకనే.. దాసోజు లాంటి దుర్మార్గులు పదవుల మీద ఆశతో.. పార్టీలు మారడమే కాదు. కేసీఆర్ లాంటి నాయకుడికి లేఖలు రాస్తూ నవ్వులపాలైపోతున్నాడు. కాంగ్రెస్ లో ఆటలో అరటిపండులా మారిపోతున్నాడు.

Top